మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో వేసిన మ్యాసివ్ సెట్లో తన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో మొత్తం 13 మ్యాసీవ్ సెట్లను నిర్మించింది చిత్ర బృందం. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కథానాయికగా నటించడానికి సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్‌ను మేకర్స్ ఎంపిక చేశారు. త్రిష గతంలో చిరంజీవితో కలిసి ‘స్టాలిన్’ మూవీలో నటించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవుతుంది.
ఇకపోతే త్రిష ఈ రోజు షూట్లో జాయిన్ అయ్యారు. ఆమెకు చిరంజీవి, దర్శకుడు వశిష్ట, నిర్మాతల నుంచి ఘన స్వాగతం లభించింది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్‌కి ఆమె తన చార్మ్, గ్రేస్ ను జోడించడానికి సిద్ధంగా వున్నారు. ఇకపోతే మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్లీయస్ట్ చిత్రంగా నిలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది.
Welcoming "The South Queen" @trishtrashers on board for the Majestic #Vishwambhara
She is all set to add her charm and grace to the MEGA MASS BEYOND UNIVERSE
In cinemas 10th Jan 2025
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota… pic.twitter.com/MR8awmScpt
— UV Creations (@UV_Creations) February 5, 2024