త్రిష కనిపించడం లేదు…

trishaగ్లామర్ కధానాయికగా ఓ వెలుగు వెలిగిన త్రిష…. ఇప్పుడు ఆ వైభవాన్ని కోల్పోయింది. తెలుగులో త్రిష… కనిపించడం లేదు. తమిళం లోనూ గొప్ప అవకాశాలు అందడం లేదు. దాంతో కెరియర్ ని ఎలా గాడిలో పెట్టుకొవాలో అర్ధం కావడం లేదు. తెలుగులో ఎందుకు నటించడం లేదు? అని అడిగితే… “సరైన పాత్రలు రావడం లేదు. నటిగా చాలెంజింగ్‌ గా వున్న పాత్రలకోసం ఎదురు చూస్తున్నా” అని రొటీన్ గానే సమాధానం చెబుతోంది. నిజానికి… త్రిష పేరు మన దర్శకులు ఎప్పుడో మర్చిపోయారు . సమంత, కాజల్, తమన్నా… దూసుకుపోతున్న ఈ తరుణంలో త్రిష డేట్ల కోసం ఎవరూ ఎదురుచూడడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘దమ్ము’ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేక పోయింది. ఇప్పుడు ఎలాగైనా సరే… తెలుగులో ఓ భారీ ఆఫర్ అందుకోవాలని గట్టి ప్రయత్నాల్లో వుంది. త్రిషని ఏ దర్శకుడు కరుణిస్తాడో చూడాలి.