Site icon TeluguMirchi.com

వివాదంలో మరో సినిమా

సినిమాలకు “వివాదం” ఓ అంటువ్యాధిలా, ప్రస్థుతం నడుస్తున్నది సినిమాలకు వ్యాధుల సీజన్‌ లా అనిపిస్తోంది. “కెమెరామన్‌ గంగతో రాంబాబు”, “ఎ ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మనిజం”, “దేనికైనా రెడీ”, “బస్‌ స్టాప్‌”, “డమరుకం” …. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వివాదాలకు గురవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి తాజాగా “తుపాకి” సినిమా కూడా చేరిపోయింది. సినిమా కథపరగా చూస్తే ఓ మిలిటరీ సీక్రెట్‌ ఏజెంట్‌ ముంబై బాంబ్‌ బ్లాస్టింగ్‌ కు కారణమైన తీవ్రవాద సంస్థను తుదముట్టించడం ముఖ్య కథ. మన సినిమాల్లో తీవ్రవాద సంస్థలంటే ఏ పాకిస్థానో, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచో వచ్చిన ముస్లింలుగా చూపించడం ఆనవాయితీగా మారిపోయింది. తుపాకీలో కూడా దర్శకుడు మురుగదాస్‌ ఇదే ఫార్ములాతో వెళ్ళిపోయాడు. సినిమా మంచి హిట్‌ టాక్‌ తెచ్చేసుకుంది. అయితే ఇప్పుడు చెన్నైలోని కొన్ని ముస్లిం వర్గాలు తుపాకీ చిత్రం తమను కించపరిచేదిగా ఉందని ఆందోళన‌ చేయడమే కాకుండా హీరో విజయ్‌, దర్శకుడు మురుగదాస్‌ ల ఇళ్ళను ముట్టడించాయి. దీంతో వారి ఇళ్ళకు గట్టి భద్రతను ఏర్పాటుచేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ సినిమా ఆంధ్రలో కూడా విడుదలైంది. ప్రస్థుతానికైతే ఆల్‌ ఈజ్‌ వెల్‌… మరి సెగ మొదలైన తర్వాత పాకడం షరా మామూలే… మరి ఆ సెగ మనకూ పాకుతుందేమో వేచి చూడాలి.

Exit mobile version