తుఫాన్ డేట్ ఫిక్స్‌

chrerri-thufanరామ్‌ చ‌ర‌ణ్ బాలీవుడ్‌ లో కి ఎంట్రీ ఇస్తున్న చిత్రం జంజీర్‌. తెలుగులో తుఫాన్‌గా రాబోతోంది. చ‌ర‌ణ్‌ తో ప్రియాంకా చోప్రా జోడీ క‌ట్టింది. ఈ సినిమా విడుద‌ల తేదీ ఖారారైంది. సెప్టెంబ‌రు 6న తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష్లల్లో ఈ సినిమాని ఒకేసారి విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. జులై 24న ఎవ‌డు రాబోతోంది. 40 రోజుల వ్యవ‌ధిలో తుఫాన్ వస్తుంది. అంటే మెగా అభిమానులకు ఇక పండ‌గేన‌న్నమాట‌. జంజీర్ బాలీవుడ్‌ లో త‌న‌కు రైట్ ఎంట్రీ అని చ‌ర‌ణ్ భావిస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే… అక్కడ మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. ఫ‌ర్హాన్ అక్తర్ ద‌ర్శక‌త్వంలో న‌టించ‌డానికి చెర్రీ ఒప్పుకొన్నాడ‌ని టాక్‌. ఇక జంజీర్ బ‌య‌ట‌కు వ‌స్తే… సిస‌లైన తుఫాన్‌ని చూడొచ్చు.