కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు !

rutupavanaaluరెండు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించాయి. దీంతో.. కేరళ, కోస్తా, కర్ణాటక లక్షదీవ్, అండమాన్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావార శాఖ అధికారులు తెలియజేశారు. అయితే, మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. జార్ఖండ్ పై అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో.. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.