ఆ పత్రిక, ఆ ఛానల్ నా వెంట్రుక తో సమానం – రామ్ చరణ్

naayak_movie_audio_launch_01రామ్ చరణ్ లో ఆవేశం పొంగుకొచ్చింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. ‘బాబాయ్ పవన్ కళ్యాణ్‌ కీ, తన కుటుంబానికీ మధ్య విబేధాలు సృష్టించిన మీడియా పై నిప్పులు చెరిగారు చరణ్. ఇందుకు ‘నాయక్’ పాటల వేడుక వేదిక అయ్యింది. ఈ పాటల పండగలో చరణ్ మాట్లాడుతూ “డాడీ తరవాత నేను కాదు. బాబాయ్ పవన్ కల్యాణే. మా అనుబంధం  గురించి మాకు మాత్రమే తెలుసు. ఆయన మా వేడుకలకు వచ్చినా, రాకపోయినా మాతో ఉన్నట్టే. ఓ పత్రిక, ఓ ఛానల్ మా కుటుంబం మధ్య విబేధాలు వచ్చాయని అందుకే ‘రచ్చ’ సినిమా ఆడియోకు పవన్ బాబాయ్ రాలేకపోవటం వెనుక లేని పోనీ కారణాలు ఆ పత్రిక, ఛానల్ రాసాయి. ఇదంతా అవాస్తవం… అలాంటి మీడియాను నేను లెక్క చేయను. మెగా కుటుంబంలో అందరూ ఒక్కటే.. మా మధ్య విభేదాలు సృష్టించటం ఎవరివల్లా కాదు.” అని ఆవేశంగా అన్నారు. రామ్ చరణ్ ఆవేశం ‘ సాక్షి ‘ గా ఆ పత్రిక, ఛానల్ ఏవైవుంటాయా అని అందరూ చెవులు కొరుక్కున్నారు.

naayak_movie_audio_launch_0పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యావత్తూ ఒకే కుటుంబమని, అందరూ బావుండాలని ఆకాంక్షించారు. రామ్ చరణ్ డ్యాన్సులు బాగా చేస్తాడని కితాబు ఇచ్చారు. తన మనసుకు నచ్చితేనే ఏ పని అయినా చేస్తానని, ఎవరితోనైనా మాట్లాడతానని అన్నారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ రామ్ చరణ్ ఇరవై సినిమాల తర్వాత పెట్టాల్సిన టైటిల్ ఇప్పుడే పెట్టారని, అందుకు తగ్గట్టుగానే చరణ్ ఈ సినిమాలో పూర్తిస్థాయి పెర్ఫార్మెన్స్ చేసివుంటాడని తాను భావిస్తున్నాని అన్నారు.

naayak_movie_audio_launch_06డ్యాన్సుల్లో, అభినయంలో చిరంజీవి మామయ్యది ఎవరికీ అందని ఒక ప్రత్యెక శైలి అని, దానిని రామ్ చరణ్ స్వంతం చేసుకుని తండ్రిని మించిన తనయుడిగా సినిమా సినిమాకు ఎదుగుతున్నాడని అల్లు అర్జున్ అన్నారు. డిల్లి నుంచి ఆన్ లైన్ లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి ‘ నాయక్‌ ‘ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు వినాయక్ ‘ నాయక్‌ ‘ చిత్రాన్ని మెగా అభిమానుల అంచనాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉంటారని తాను భావిస్తున్నానని అన్నారు. చరణ్ డ్యాన్సుల్లో పరిపక్వత సాధించాడని చిరంజీవి ప్రశంసించారు.

naayak_movie_audio_launch_02ఆడియో సి.డి.ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించి తొలి డిస్కును చిరంజీవి సతీమణి సురేఖా చిరంజీవి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. చిరంజీవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఒకేసారి మెగా హీరోలందరినీ ఈ సందర్భంగా ఒకే వేదికపై చూడవచ్చన్న మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు.రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన మెగా అభిమానులతో నానక్ రామ్ గూడా ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయింది.