తమన్నా ముదిరిపోయిందట!

చేయూతనిచ్చి పాపులారిటీ అందించిన తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలకు చెయ్యిచ్చి, హిందీ చిత్రసీమకు చెక్కేద్దామనుకున్న మిల్కీ బ్యూటీ తమన్నాకు బాలీవుడ్‌ లో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. అజయ్‌ దేవగణ్‌ కు జంటగా హిందీలొ “హిమ్మత్‌ వాలా” చిత్రంలో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే! ఆ చిత్రంతో ఎలాంటి భరోసా లభించిందో తెలీదు కానీ, తమ్మూ ఏకంగా అక్కడే సెటిలై పోదామనుకుంది. అంతే, తెలుగు, తమిళ సినిమాలకు డేట్స్‌ ఇవ్వకుండా “ఉందిలే మంచి కాలం ముందుముందునా” అనుకుంటూ రాబోయే బాలీవుడ్‌ ఆఫర్ల కోసం డేట్స్‌ ఖాళీగా ఉంచుకుంటూ వస్తోందని సమాచారం. అలనాటి ప్రముఖ హీరో జాకీష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ ను లాంఛ్‌ చేస్తూ రాబోతోన్న ఓ సినిమాలో నిర్మాత సాజిద్‌ నడయాడ్‌ వాలా తమన్నాను హీరోయిన్‌ గా తీసుకున్నారట. అయితే ఉన్నట్టుండి ఆ చిత్ర యూనిట్‌ సడన్‌ గా తమ నిర్ణయాన్ని మార్చుకుని తమన్నాకు సారీ చెప్పెసినట్టు సమాచారం. విషయమేంటి చెప్మా అని ఆరాతీస్తే తమ్మూ.. టైగర్‌ ష్రాఫ్‌ పక్కన ఒకింత ముదురుగా కనిపిస్తుందన్న నిర్ణయానికి వచ్చారట జంటను పోల్చి చూసిన అందరూ. దీంతో తమన్నాని తప్పించి లేతగా కనిపించే మరో సుందరాంగి కోసం వెదకులాట మొదలెట్టేశారట. పాపం తమన్నా! ఏదో అనుకుని పోతే మరేదో ఎదురయినట్టు ముదురయిపోయిందన్న కామెంట్స్‌ వినాల్సి వచ్చేసరికి ఢీలా పడిపోయిందంటూ సన్నిహితులు చెప్పుకుంటున్నారు.