Site icon TeluguMirchi.com

పారిపోవడానికి సిద్దంగా వున్న హీరోయిన్ ?

tamannaతమకు పేరు తీసుకొచ్చింది ఏ ఇండస్ట్రీ అయిన చివరకు అందరు భామలు కోరుకునేది, జపించేది నామమే … బాలీవుడ్. ఇప్పుడు మన మిల్క్ బ్యుటీ తమన్నా కూడా ఆ లిస్టు లో చేరిపోయింది. తమన్నా… తక్కువ కాలంలోనే దాదాపు తెలుగు, తమిళ యువ హీరోలందరితో ఆడి పాడి మంచి క్రేజ్ నే సంపాదించుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీబిజీ గా గడుపుతున్న తరుణంలో బాలీవుడ్ నుండి ఓ బంపర్ ఆఫర్ ‘హిమ్మత్ వాలా’ రూపంలో తగిలింది. అజయ్ దేవగణ్ హీరోగా రానున్న ‘హిమ్మత్ వాలా’ రీమేక్ లో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది ఈ రెబల్‌ సుందరి. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తుందట. అందుకే నాగ చైతన్యతో చేస్తున్న ఒక్క సినిమా…”భలే తమ్ముడు” తప్ప మరే సినిమాకి అంగీకరించలేదు తమన్నా. ఈ పరిణామాలు అన్నిటి పై ఓ లుక్ వేస్తే తమన్నా రెడీ టూ జంప్ అని అర్ధమౌతుంది. మరి తన బాలీవుడ్ ప్రయాణం ఎలా సాగుతుందో చుడాలిమరి! ఒక వేళా సాఫీగా సాగకపోయిన బ్యాక్ టూ పెవిలియన్ అంటే హరతులిచ్చి స్వాగతించే నైజం మనది కదా!

Exit mobile version