టెట్, డీఎస్సీ కలిపి ఒకే పరీక్ష

ఉపాధ్యాయ అర్హతలకు సంబంధించి ఇప్పటి వరకు డీఎస్సీ, టెట్‌లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇకపై రెండూ కలిపి ఒకే పరీక్షగా నిర్వహించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి పార్థసారథి అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం అనంతరం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చితూరులో రూ. 4500 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదించామని ఆ పనులు మరో పదిహేను రోజుల్లో ప్రారంభమవుతాయని తెలిపారు.