Site icon TeluguMirchi.com

ఓయూలో ఉద్రిక్తత !

ouతెలంగాణ రాజకీయ ఐకాస ఈ నెల 14న “ఛలో అసెంబ్లీ” చేపట్టనున్న నేపథ్యంలో.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా, ’ఛలో అసెంబ్లీ’ కి మద్ధతు ఇవ్వాలని ఈరోజు విద్యార్థులు బైకు ర్యాలీ నిర్వహించారు. అయితే, విద్యార్థుల ర్యాలీని పోలీసులు ఎన్‌ సీసీ గేట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో.. విద్యార్దులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో.. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, “ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా ఓయూ, కేయూ విద్యార్థి నాయకులను
పోలీసులు అదుపులోనికి తీసుకోవడంపై కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైమైనా.. ఈనెల 14న జేఏసీ చేపట్టిన “ఛలో అసెంబ్లీ” తో తెలంగాణ ప్రాంతంలోని ఓయూ, కేయూ, మహాత్మ గాంధీ.. తదితర విశ్వవిద్యాలయాలలో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.

Exit mobile version