లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు తెలిపింది పదో తరగతి తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి చదువుకున్న ఇతర ప్రాంతాల విద్యార్థులను..ఎక్కడి వారిని అక్కడే తమ సొంత ప్రాంతాల్లో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. విద్యార్థుల వివరాలను తమ జిల్లా డీఈవోలకు పంపించాలని విద్యాశాఖ ఆదేశించింది.
ఇక మరోపక్క టెన్త్ క్లాస్ పరీక్షలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు.. రేపటికి వాయిదా వేసింది. కంటైన్మెంట్ జోన్లో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని, సప్లిమెంటరి ఎగ్జామ్స్ గురించి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దీంతో ప్రభుత్వాన్ని సంప్రదించి.. రేపు నిర్ణయం తెలుపుతామని సమాధానమిచ్చారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లు తెరిచేందుకు..తాత్కాలికంగా అనుమతి ఇస్తామని విద్యాశాఖ కోర్టుకు చెప్పింది.