Site icon TeluguMirchi.com

Uruku Patela : నన్నుపెళ్లి చేసుకో లైఫ్ ఇస్తా !!


Uruku Patela Teaser : హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అడివి శేష్ రిలీజ్ చేశారు.

Also Read : ‘విశ్వం’ నుంచి జర్నీ అఫ్ విశ్వం.. ‘వెంకీ’ సినిమా ట్రైన్ ఎపిసోడ్ రిపీట్..

టీజర్ ఆద్యంతం చాలా ఆసక్తిగా, వినోదాత్మకంగా సాగింది. నన్ను పెళ్లి చేసుకో లైఫ్ ఇస్తా అంటూ హీరో చదువుకున్న అమ్మాయిల వెంట పడుతుంటాడు. పెళ్లి కోసం హీరో పడే తిప్పలు చాలా ఫన్నీగా చూపించారు. ఈ చిత్రం గ్రామీణ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో తేజస్ కంచర్ల మాట్లాడుతూ.. ‘మా టీజర్‌ను లాంచ్ చేసిన అడివి శేష్ గారికి థాంక్స్. మంచి కంటెంట్ ఇవ్వాలని కాస్త టైం తీసుకున్నాను. మా నాన్నను చాలా కష్టపెట్టాను. ప్రవీణ్ లక్కరాజు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఆగస్ట్ నుంచి పాటల్ని రిలీజ్ చేస్తాం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా దర్శకుడు వివేక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కాఫీ షాప్, బార్ షాప్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చర్చించుకునే వాళ్లం. కెమెరామెన్ సన్నీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కుష్బూతో నటించడం ఆనందంగా ఉంది. సెట్స్‌కి కరెక్ట్ టైంకి వచ్చి ఎంతో సహకరించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

Uruku Patela Teaser | Tejus Kancherla, Khushboo | Vivek Reddy | Pravin Lakkaraju | Bala Bhanu

Exit mobile version