సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా..ప్రస్తుతం ఈయన పెట్టిన ట్వీట్ అలాగే అనిపిస్తుంది. “ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….” అంటూ తమ సింగిల్స్ ఆర్మీ వాట్సాప్ గ్రూప్ లో ప్రభాస్ కు సారీ చెప్పి తాను కూడా ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యిపోయాడు. ఈ ట్వీట్ చూసి చాలామంది తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుంది. .అందుకే ఆలా ట్వీట్ చేసి ఉంటాడు అని అంత మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం ఈయన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా..లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది.
ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020