ఘనంగా తానా మహాసభలు

chiranjevi taanaఅమెరికాలో 19 వ తానా మహాసభలు ఘనంగా జరిగాయి. పలు దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు సేవాకార్యక్రమాల్లో ఆసక్తి చూపుతున్నారని సమాజాభివృద్ధికి కూడా వీరు నడుంబిగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పిలుపునిచ్చారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో జరిగిన తానా 19 వ మహాసభల్లో తెలుగు భాషాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి ప్రవాసాంధ్రులు కృషి చెయ్యాలని ఆయన కోరారు. అమెరికాలోని తెలుగు వారు వివిధ సంఘాలుగా విడిపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. అంతర్జాలంలో తెలుగు వినియోగం విస్తృతమైందని ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. త్వరలోనే సంక్షిప్త సందేశాలను తెలుగులో పంపుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. కూచిపూడిని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించిన ఘనత అమెరికాలోని ఆంధ్రులకే దక్కిందని తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ద ప్రసాద్ తెలిపారు.ఇక డాలస్ లోని కన్వెన్స్ న్ సెంటర్లో ఏర్పాటు చేసిన మహాసభలను కేంద్ర పర్యాటక శాక మంత్రి కె. చిరంజీవి ప్రారంభించారు.