గొడవేం లేదు, మీకు చేతులెత్తి మొక్కుతున్నా అంటూ తమ్మారెడ్డి రిక్వెస్ట్

రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ.

బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని నాగబాబు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. దీని ఫై సోషల్ మీడియా లో మెగా , నందమూరి ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి ఈ వివాదం ఫై స్పందించారు. ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఎలాంటి వివాదం లేదు. మధ్యలో ఉన్న వాళ్లు నోరు జారి ఉండవచ్చు… ఎవరు జారినా తప్పే. బాలకృష్ణ గారు మాట్లాడింది.. నాగబాబు గారు మాట్లాడింది తప్పే. వాళ్ల వ్యాఖ్యల్ని సినీ పెద్దగా ఖండిస్తున్నా. దీన్ని ఇక్కడితో వదిలేయండి. జరిగింది మరిచిపోండి. ఈ వివాదం తరువాత బాలకృష్ణ గారితో మాట్లాడాం.. అన్నీ అయిపోయాయి. చిరంజీవి గారితో కూడా మాట్లాడాం. వివాదానికి ముగింపు పలికాం. మీడియాకి చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి.. కాంట్రవర్శి చేయకండి అంటూ రిక్వెస్ట్ చేసారు.