Site icon TeluguMirchi.com

చైతూతో హ్యాట్రిక్ కొడుతుందా??

tamannaహిట్ ఫెయిర్లకు తెలుగులో తెగ డిమాండ్. ఒక సినిమా హిట్టయితే అదే జోడీతో మ‌రిన్ని సినిమాలొచ్చేస్తాయ్‌. నాగ‌చైత‌న్య – త‌మ‌న్నాలు కూడా ప‌సందైన జంటే. 100 % ల‌వ్ సినిమాతో తొలి హిట్ కొట్టారు వీళ్లిద్దరూ. ఆ త‌ర‌వాత క‌లిసి న‌టించిన త‌డాఖా కూడా హిట్టే. ఈ విజ‌య‌వంత‌మైన క‌ల‌యిక‌ల మ‌రోసారి చూసే అవ‌కాశం ద‌క్కనుంది. శ్రీ‌నివాస‌రెడ్డి ద‌ర్శక‌త్వంలో నాగచైత‌న్య న‌టిస్తున్న సంగ‌తి తెలిసింది. హ‌లో బ్రద‌ర్‌కి సీక్వెల్ సినిమా ఇది. ఇందులో త‌మ‌న్నా క‌థానాయిక‌గా నటించే అవ‌కాశాలున్నాయి. ఈ జోడీ సెట్టయితే… ఈ ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టిన‌ట్టే. ఈ సినిమాలో మ‌రో క‌థానాయిక‌కీ స్థానం ఉంది. ఆ అవ‌కాశం ఎవ‌రికి లభిస్తుందో చూడాలి.

Exit mobile version