ప్రేమకు చిహ్నం గా చెప్పుకునే తాజ్‌మహల్ అంటే అందరికి ఇష్టం..అలాంటి తాజ్‌మహల్ పాక్షికంగా దెబ్బతిన్నది. ఉత్తర ప్రదేశ్ లోశుక్రవారం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో విజృంభించిన వర్షం ధాటికి తాజ్ మహల్ పాక్షికంగా దెబ్బతింది. సమాధి, రెడ్ సాండ్ స్టోన్ దగ్గరి పాలరాతి రెయిలింగ్ ధ్వంసం అయిందని శనివారం ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ తెలిపారు.
సమాధి పైకప్పు కూడా చెల్లాచెదురైందని ఆయన వెల్లడించారు.తాజ్ మహల్ చుట్టూ ఉండే చాలా చెట్లు దెబ్బతిన్నాయి.ఆర్కియాలజీ సిస్టం అఫ్ ఇండియా ప్రధాన అధికారి వివి విద్యావతి తాజ్ మహల్ ను సందర్శించి నష్ట తీవ్రతను అంచనా వేశారు.అయితే తాజ్ మహల్ లో దెబ్బతిన్న చిహ్నాలను ,పిల్లర్లను మరియు తదితర వాటిని బాగుచెయ్యాలంటే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని వెల్లడించారు.