అసెంబ్లీ భవనం ఎక్కిన ఎమ్మెల్యేలు.. !

t-mlas“ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో.. తెలంగాణ వాదులను పోలీసులు అడుగడుగునా.. అదుపులోనికి తీసుకోవడంతో తెరాస ఎమ్మెల్యేలు తమ వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. తెరాస ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, కావేటి సమ్మయ్య ఈరోజు ఉదయం (శుక్రవారం) శాసనసభలో టీఆర్ ఎస్ శాసనసభ పక్ష కార్యాలయం పైకి
ఎక్కారు. “చలో అసెంబ్లీ” సందర్భంగా..  అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ వద్దకు వస్తే పైనుంచి కిందకు దూకుతామని వారు హెచ్చరించారు. కాగా,  పోలీసులు వారిని కిందకు దించేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అయితే, తెరాస ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, హారీష్ రావు.. తదితరులను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు తెరాస ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోనే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తగలపెట్టి చావు డప్పుకొట్టారు. అయితే, అసెంబ్లీ చరిత్రలోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఆవరణలోనే నినాదాలు చేస్తూ.. దిష్టబొమ్మ కాల్చడం మొదటిసారని తెలుస్తోంది.