బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు వినిపిస్తుండడం తో అంత నిజమే కావొచ్చని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కేసును సిబిఐ కి అప్పగించింది.
రంగంలోకి దిగిన సిబిఐ కేసు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాజాగా సుశాంత్ కు చెందిన డైరీలో కొన్ని పేజీలు అదృశ్యం అయినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. సాధారణంగా రోజూ జరిగే విషయాలను సుశాంత్ డైరీలో రాస్తూంటాడని.. సన్నిహితులు చెబుతున్నారు. అయితే మిస్ అయిన ఆ డైరీ పేజీల్లో సుశాంత్ ఏం రాసి ఉంటాడన్న విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, లాయర్ షెహదాద్ పూనావాలా కూడా డైరీలో పేజీలు మిస్ అయిన విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే.
కాగా సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి నటి రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. రియాతో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, తల్లి సంధ్య చక్రవర్తి, సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరింద, రియా చక్రవర్తి మాజీ మేనేజర్ శ్రుతీ మోదీలతో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.