బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు వినిపిస్తుండడం తో అంత నిజమే కావొచ్చని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించింది సుప్రీం కోర్ట్.
ఇప్పటివరకు సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. కాగా జూన్ 14లో సుశాంత్ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్‌లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది.