పెళ్లి డేట్ ను అధికారిక ప్రకటన చేసిన సింగర్ సునీత

సింగర్ సునీత…ఈమె తెలియని తెలుగు సంగీత ప్రియులు లేరు. ఎన్నో వందల పాటలు పాడిన ఈమె..ఇప్పుడు రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేని ని ఈమె పెళ్లి చేసుకోబోతుంది. రీసెంట్ గా ఆయనతో సునీత నిశ్చితార్థం జరుపుకుంది. కొద్ది మంది స‌మ‌క్షంలోనే వీరి నిశ్చితార్ద వేడుక జరిగింది. ఇక ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు స్వయంగా తెలిపి అభిమానులను సంతోష పరిచింది.

తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీత .. ”వచ్చే నెల 9వ తేదీన నా వివాహాం జరగనున్నది” అని తెలిపింది. ఆ అలాగే కొత్త జీవితం బాగుండాలని శ్రీవారిని ప్రార్ధించా… కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా శ్రీవారి దర్శనానికి దూరమయ్యా… ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా వుంది అని సునీత తెలిపింది.