Site icon TeluguMirchi.com

సునీత కన్నీరు పెట్టుకునేంత పనిచేసింది..

సింగర్ సునీత రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడింది. ఈమెకు కరోనా వచ్చినదని తెలియగానే సంగీత ప్రియులు అయ్యో అంటూ ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అయితే అలా ఆరా తీసిన వారందరికీ థాంక్స్ చెపుతూ తాను కరోనా నుండి బయటపడినట్లు తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో పట్ల కొంతమంది నెటిజన్లు తప్పుగా కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ తనను ఎంతగానో బాధకు గురి చేసాయి అంటూ మరో వీడియో పోస్ట్ చేసింది.

తన ఫేస్ బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో.. నాకు ఉన్నవి చాలవా? అంటూ తన బాధను వ్యక్తపరిచారు సునీత. ‘అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియోకి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు. ఈ వీడియో యూట్యూబ్‌లో చెక్కర్లు కొడుతోంది. మంచిదే.. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా అభిమానులు నాతో మాట్లాడుతూ వుంటారు. అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది.

కానీ విషయం వదిలేసి సమాజం లో ఉన్న చాలా మంది న్యాయనిర్ణేతలు (కోర్టులో ఉండేవారు కాదు) “ఏ తెలుగు రాదా, ఫ్యాషన్ ఆ, కారోనా వస్తే ముందు హాస్పిటల్‌కి వెళ్లి చావు.. మీడియాలో పబ్లిసిటీ కోసం అవసరమా’ లాంటి తీర్మానాలు చేస్తుంటే ఈరోజు నుండి కారోనా గురించి నా అనుభవం మరియు నేను కల్పించాలనుకున్న అవగాహన కార్యక్రమాలు విరమించుకుంటున్నాను. ఇంకా ఏం వినాల్సొస్తుందో .. వున్నవి చాలవా… గాడ్ బ్లెస్ యూ.. మీకో నమాస్కారం అంటూ ఎమోజీలను తన పోస్ట్‌లో షేర్ చేసింది.

Exit mobile version