జిల్ చిత్రంతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ ..ఈ మధ్యనే ప్రభాస్ తో సాహో చిత్రాన్ని తెరకెక్కించి ఇండియా వైజ్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆయన.. ఆమె మెడలో మూడు ముళ్ళేసేందుకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే జూన్ 10వ తేదీన సుజీత్ నిశ్చితార్థం చేసుకుకోనున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో సుజీత్ ఎంగేజ్మెంట్ జరగనుందట. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డాక్టర్ అని సమాచారం.