Site icon TeluguMirchi.com

Janaka Aithe Ganaka Teaser : పిల్లలు వద్దంటున్న సుహాస్..


దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ నుంచి వస్తున్న సినిమాలు కంటెంట్ పరంగా కొత్తగా ఉండటం, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉండటం గమనిస్తూనే ఉన్నాం. ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన బ‌లగం ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. ల‌వ్ మీ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించానారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు.

Pawan Kalyan : నేను ‘ఓజీ’ అంటే మీరు ‘క్యాజీ’ అంటారు : పవన్ కళ్యాణ్

ఆల్రెడీ ఇప్పటి వరకు వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది.. నేను ఒక వేళ తండ్రినైతే.. నా పెళ్లాన్ని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్‌లో చూపించాలి.. నా పిల్లల్ని బెస్ట్ స్కూల్‌లో చేర్పించాలి.. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి.. బెస్ట్ జీవితాన్ని ఇవ్వాలి.. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు..’ అనే డైలాగ్స్ హీరో ఫ్రస్ట్రేషన్, మిడిల్ క్లాస్ లైఫ్ కష్టాలను ఎంతో ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు సరైన పాళ్లలో ఉన్నాయని ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది.

Vishwaksen : లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్

సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ, విజ‌య్ బుల్గానిన్ సంగీతం టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయబోతోన్నారు. సంకీర్తన విపిన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Janaka Aithe Ganaka Teaser - Suhas | Sangeerthana |  Sandeep Bandla | Vijai Bulganin | Dil Raju

 

Exit mobile version