Site icon TeluguMirchi.com

ఆకతాయి ఫోన్ కాల్ తో.. ఆగిన పెళ్లి !

bridedroom stopఓ ఆకతాయి ఫోన్కాల్ తో ఓ వివాహం ఆగిపోయింది. బాజభజంత్రీలు, సన్నాయి మేళాలు నిలిచిపోయాయి. పెళ్లి కుమార్తెను తాను ప్రేమించానంటూ.. ఓ ఆకతాయి పెళ్లి కొడుకుకి ఫోన్ చేయడంతో..  మగపెళ్లివారు  పెళ్లి తంతును విరమించుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ జ్యోతినగర్ అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతికి నగునూరు గ్రామానికి చెందిన కోట కనకయ్యతో ఈరోజు (గురువారం) ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవద్దంటూ రమేష్ అనే యువకుడు పెళ్లి కొడుకు ఫోన్ చేయడంతో..
మగపెళ్లివారి బృందం పెళ్లి మండపానికి రాలేదు. మగపెళ్లివారి ధోరణితో.. తీవ్ర మనస్థాపం చెందిన పెళ్లి కూతురు తండ్రిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రమేష్ ను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version