Site icon TeluguMirchi.com

శృతి హాసన్ కు మానసిక సమస్యలు..

కమల్ కూతురి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శృతి హాసన్..కెరియర్ మొదట్లోనే ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకొని..ఆ తర్వాత గోల్డెన్ గా లెగ్ మారింది. వరుస సక్సెస్ లు అమ్మడిని పలకరించడం తో అగ్ర హీరోల ఛాన్సులు తలుపు తట్టాయి. కానీ అమ్మడు మాత్రం వాటిని కాదని ప్రేమలో పడి సినిమాలకు దూరం అయ్యింది. ఇక ప్రేమ విఫలం కావడం తో మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం తెలుగు లో రవితేజ సరసన క్రాక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. లాక్ డౌన్ సమయంలో ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే ఇటీవలి కాలంలో నటనకు దూరంగా ఉన్నానని చెప్పిన ఆమె, గత మూడేళ్లుగా తాను మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నానని వెల్లడించింది. తన సమస్యలకు చికిత్సను కూడా పొందుతున్నానని చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్ డౌన్ తో ఆగిపోయిందని, ఇది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితని అభివర్ణించింది. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పింది.

ఇక తనకు మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పడానికి ఏ మాత్రమూ బాధ పడటం లేదని, ధ్యానం, యోగా, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తున్నానని శ్రుతీ హాసన్ తెలిపింది. పుస్తకాలను చదవడం, రాయడం, సంగీతం వినడం వంటివి కూడా చేస్తున్నానని చెప్పింది.

Exit mobile version