ప్రభాస్ కళ్లు బాగుంటాయి అంటున్న శ్రీయ

శ్రీయ..ఈ పేరు గురించి కొత్తగా చెప్పాలిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా తన హావ కొనసాగిస్తూనే ఉంది. అగ్ర హీరోలతో పాటు యాంగ్ హీరోలతో జోడి కట్టి సక్సెస్ లు అందుకుంది. ప్రస్తుతం పెళ్లి చేసుకున్నాక కూడా అమ్మడికి అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన ఈ భామ ..తాజాగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ హీరోల గురించి చెప్పుకొచ్చింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కళ్లు బాగుంటాయని.. అలా చూస్తూ ఉండిపోవచ్చని చెప్పుకొచ్చింది. ప్రభాస్ – శ్రియా కలిసి ‘ఛత్రపతి’లో నటించారు. అంతేకాకుండా ‘మున్నా’ సినిమాలో ఒక సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళంలో తనకు ఫేవరేట్ హీరో అని.. ఆయన ఒక పవర్ హౌజ్ అని చెప్పింది. రజినీతో కలిసి ‘శివాజీ’ సినిమాలో నటించేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది. ఇక ఎన్టీఆర్ ఒకప్పుడు చూస్తే చాలా సైలెంట్ గా కనిపించేవాడని.. కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు.. ప్రస్తుతం అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పింది శ్రీయ. వీరిద్దరూ ‘నా అల్లుడు’ సినిమాలో కలిసి నటించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ అతను చాలా మంచి యాక్టర్ అని.. పవన్ బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. తమిళ్ హీరో ధనుష్ అద్భుతమైన టాలెంటెడ్ యాక్టర్ అని.. ఆయనతో నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. ధనుష్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని.. తనకు కొడుకు పుట్టినప్పుడు నేను తండ్రి అయ్యానని సంతోషంగా అందరికీ చెప్పాడని వెల్లడించింది.