Site icon TeluguMirchi.com

గ్రాండ్ ఫ్రీ బ్యాడ్మింటన్ విజేత శ్రీకాంత్

K-Srikanthథాయ్లాండ్ ఓపెన్ గ్రాండ్ ఫ్రీ బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. 13వ సీడ్గా బరిలోకి దిగిన శ్రీకాంత్ 8వ సీడ్ పొన్సానపై 21- 16, 21- 12తేడాతో ఈ విజయాన్ని కైవసం చేసుకున్నాడు.  పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన ఈ తెలుగు ఆశాకిరణం.. టైటిల్ ప్రస్థానంలో తనకన్నా మెరుగైన ర్యాంకర్లను చిత్తు చేయడం విశేషం. కాగా, ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే.

Exit mobile version