అభిరామ్ కార్ ప్రమాదం ఫై శ్రీ రెడ్డి కామెంట్స్

కాస్టింగ్ కౌచ్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన శ్రీ రెడ్డి..ఆ తర్వాత ఎలాంటి సంచలనాలు తెరలేపిందో తెలిసిందే. ఈ భామ మరోసారి అభిరాం ఫై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. శ్రీ రెడ్డి – అభిరాం ల వ్యవహారం గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అభిరాం కార్ ప్రమాదం జరిగినట్లు ఉదయం నుండి మీడియా లో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ ప్రమాదం ఫై శ్రీ రెడ్డి స్పందించింది. అభి నీకు గుర్తుందా ? నీ కారు ఎంత ? నీ స్టేటస్ ఎంత ? నేను రామానాయుడు మనవడిని ? సురేష్ బాబు కొడుకును ? వెంకటేష్ పుత్ర రత్నాన్ని ? రానా తమ్ముడిని అన్నావే గుర్తు చేస్తూ.. నువ్వో అప్పట్లో నన్న ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ నటిని అన్నావే. నన్ను నా కారును అవమానించావే ? ఈ రోజు నీ కారుకు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అంటూ దేవుడు ఉన్నాడ్రా ? అంటూ చెప్పుకొచ్చింది. డబ్బు ఉంది కదా అని మిడిసిపడకు. ఈ పేరు, డబ్బు ఏది శాశ్వతం కాదు. మంచితనం, మంచి పేరు, ఎదుటి వారిని అర్ధం చేసుకోవడం. అవసరమైతే ఎవరికీ అపకారం చేయకుండా మంచిగా ఉండటం నేర్చకోవాలన్నారు. అలా అని నేనిమి ఉత్తమమురాలిని అని చెప్పడం లేదు. కానీ మటుకు నాకు కొన్ని సిద్దాంతాలు ఉన్నాయని తన కోపాన్ని వెళ్లగక్కింది.