Site icon TeluguMirchi.com

విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

కరోనా మహమ్మారి చిత్రసీమ ప్రముఖులను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి రోజు ఎవరికో ఒకరికి ఈ కరోనా సోకుతుంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఉన్నారు. ఈ విషయాన్ని వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బాలు కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. బుధువారం డాక్టర్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ కండిషన్ బాగానే ఉందని తెలుపడం తో అంత సంతోషం వ్యక్తం చేసారు.

గత రాత్రి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూకి తరలించి నిపుణులైన డాక్టర్లతో పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ క్రిటికల్‌‌గా ఉన్నట్టు ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బీపీ, షుగర్‌తో పాటు కోవిడ్ లక్షణాలు పెరగడంతో ఎస్పీ బాలు శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 5వ తారీఖు నుంచి బాలుకి చికిత్స అందిస్తుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురౌతున్నారు.

Exit mobile version