సోను బాటలో బండ్ల గణేష్

అరుంధతి చిత్రంతో పశుపతి గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సోను సూద్..ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడి సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెరపై విలన్ గా మెప్పించిన ఈయన నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. ఎవరు ఏ ఆపదలో ఉన్న వెంటనే స్పందిస్తూ వారికీ సాయం చేస్తూ దేవుడయ్యాడు.

తాజాగా ఇదే బాటలో బండ్ల గణేష్ పయనమవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తన దగ్గరకు వస్తున్న సమస్యలను అయితే దాదాపు తానే ఆర్ధిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్న వారయ్యారు. ఓ వ్యక్తి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని అందుకు తన కిడ్నీ అమ్మెందుకు సిద్ధంగా ఉన్నానని తెలుపగా ఏమాత్రం ఆలోచించకుండా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తాను హెల్ప్ చేస్తానని ముందుకొచ్చారు. అలాగే ఇదే రోజున మరో రిపోర్టర్ తనకు కరోనా వచ్చిందని సాయం కోరగా వారికి కాల్ చేసి హెల్ప్ చేస్తా అని గంట వ్యవధిలోనే 2500 వారికి పంపారు. అలా ఈ మధ్య కాలంలో బండ్ల చాలా మందికే సహాయం చేశారు కానీ చాలా వరకు వెలుగులోకి రాలేదు.