ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చిన సోనూసూద్ ..

అరుంధతి చిత్రంలో పశుపతి గా అందర్నీ మెప్పించిన సోనూసూద్‌..లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక అప్పటినుండి ప్రతి రోజు ఎవరు ఏ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈయన చేస్తున్న మంచి పనులకు ప్రతి ఒక్కరు అభిమానులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు సోను పేరును వాడుకుంటున్నారు.

ఆయన పేరు మీద నకిలీ ట్విటర్‌ అకౌంట్‌ను క్రియోట్‌ చేశారు. అంతే కాదు @Sonu sood అనే పేరుతో ఉన్న ఖాతాను చూసి అందరు దానిని ఫాలో అవుతూ ట్వీట్స్‌ కూడా చేస్తున్నారు. వాటికి ఆకతాయిలు సమాధానాలు ఇస్తూ వారి సమాచారం తీసుకుంటున్నారని తెలిసింది. దీంతో సోను సూద్‌ తన ఫాలోవర్స్‌కు, అభిమానులకు మెసెజ్ చేశారు. ఎవరో తన పేరు మీద నకిలీ ఖాతా తెరిచారని, దీని నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఫేక్‌ ఖాతా ఐడీని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.

Beware of the fake accounts. Report to the nearest police station if someone demands anything from you. ? pic.twitter.com/cyIFnokJ2K— sonu sood (@SonuSood) June 14, 2020