Site icon TeluguMirchi.com

నా భర్త తో ఉండలేకపోతున్నా అంటూ సోనూసూద్ కు విన్నపం

అరుంధతి చిత్రంతో పశుపతి గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సోను సూద్..ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడి సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కూలీలా కోసం సోను చేస్తున్న మంచి పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సోను సూద్ కు వింత వింత రిక్వస్ట్ లు వస్తున్నాయి. మొన్న ఒక వ్యక్తి తనని ఇంటి నుండి వైన్ షాపుకి తరలించాలని కోరగా, దానికి సోనూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు.

తాజాగా ఓ మహిళ తనని అమ్మగారి ఇంటికి పంపాలని సోనూసూద్ ను కోరింది . జనతా కర్ఫ్యూ నుండి లాక్‌డౌన్ 4.o వరకు నేను నా భర్తతో కలిసి ఉంటున్నాను. నన్ను నా తల్లిగారి ఇంటికి పంపుతారా…? నేను అతనితో ఉండలేకపోతున్నాను అని ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌ని కోరింది. దీనికి స్పందించిన సోనూసూద్‌.. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఇద్దరిని గోవాకి పంపుతాను. ఏమంటారు.? అని ట్వీట్ చేశాడు.

Exit mobile version