చిరుకు సోనియా క్లాస్.. !

Sonia-lashes-Chiruకేంద్ర పర్యటక శాఖా మంత్రి చిరంజీవికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్లాస్ పీకారు. క్లాస్ పీకడానికి ప్రధాన కారణం చురు అనవసరమైన చోట్లకనిపిస్తుండడం పైనేనట. ఉత్తరాఖండ్ వరదల్లో యాత్రీకరులు తీవ్ర అగచాట్లు పడుతుండగా.. సైన్యం సేవాకార్యక్రమాలు అందిస్తుంటే పర్యటకశాఖా మంత్రి అయి ఉండీ అక్కడికి వెళ్లకుండా ఏరువాక అంటూ పత్రికల పతాకశీర్షికలకు ఎక్కడమేంటని సోనియా చిందులు తొక్కారు. దేశంలోని స్వచ్ఛంధ సంస్థలు, సినీ ప్రముఖులులే కాకుండా.. చివరకు ఖండాతరంలో ఉన్న క్రికెటర్లు కూడా బాధితులకు సంఘీభావం పలుకుతుంటే ఈ రాచకార్యాలేంటని చిరును అధినేత్రి మందలించారని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవడంలో.. తాత్సారం చేసి… తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండేందుకు అవకాశమిచ్చి ఇచ్చారని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు మరోసారి పున:రావృతం కాకుండా చూసుకోవాలంటూ.. ఆమె సూచించినట్లు సమాచారం.