భూమిక బాటలోనే నడుస్తోంది స్నేహా. త్వరలో నిర్మాతగా మారబోతోంది. తన భర్త.. ప్రసన్నతో కలసి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈమధ్య కొన్ని కథలు కూడా విన్నదట. అయితే ఏదీ సంతృప్తి కలిగించలేదట. దాంతో.. మంచి కథ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. పేరున్న దర్శకుడితోనే సినిమా చేయాలని లేదు, కొత్తవాళ్లు ఎవరొచ్చినా – మంచి కథ ఉంటే చాలు అంటోంది. కానీ అలాంటి వాళ్లు స్నేహాకి ఎవరూ దొరకలేదట. తెలుగు సినీ పరిశ్రమలోని తన పాత స్నేహితులని కథల కోసం ఆరా తీస్తోంది స్నేహా. మీ దగ్గర మంచి కథ ఉంటే చెప్పండి, సినిమా చేయడానికి నేను రెడీ అంటోంది. చూశారా..? చిత్రసీమలోకథలకు ఎంత కొరత ఉందో..? నిర్మాత సిద్దంగా ఉన్నా – కథ మాత్రం దొరకడం లేదు.