Site icon TeluguMirchi.com

సూర్య సింహ గ‌ర్జన

singam-movie-audio-releaseసూర్య ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్రలో క‌నిపించిన చిత్రం యముడు. ఇప్పుడు దానికి రెండో భాగం సింగం రూపంలో వ‌స్తోంది. అనుష్క క‌థానాయిక‌. హ‌న్సిక ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. అంజ‌లి ప్రత్యేక గీతంలో న‌ర్తించింది. హ‌రి ద‌ర్శక‌త్వం వ‌హించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుద‌ల‌య్యాయి. హ‌రి యాక్షన్ స‌న్నివేశాలు తీర్చిదిద్దడంలో సిద్దహ‌స్తుడు. సూర్య-హ‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తొన్న నాలుగో సినిమా ఇది. తొలి మూడూ హిట్టే! అందుకే సింగ‌మ్‌పై అటు త‌మిళ నాటు, ఇటు తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. దానితో పాటు య‌ముడు సినిమాని వివిధ భాష‌ల్లో తీసుకెళ్లారు. ప్రతి చోటా… ఈ క‌థ క్లిక్ అయ్యింది. అదే ఫీట్ రెండో భాగం కూడా చేస్తే – కాసుల వ‌ర్షం కుర‌వ‌డం ఖాయం.

Exit mobile version