జులై 5న సింగం

singamసూర్య, అనుష్క జంట‌గా న‌టించిన చిత్రం సింగం. య‌ముడు 2 అనేది ఉప‌శీర్షిక‌. హ‌రి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్నిజులై 5న విడుద‌ల చేస్తారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. హ‌రి-సూర్య క‌ల‌యిక‌లో వ‌స్తున్న 4వ సినిమా ఇది. య‌ముడు అన్ని భాష‌ల్లోనూ బాగా ఆడింది. అందుకే.. రెండో భాగంపైనా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. హ‌రి సినిమా అంటే యాక్షన్ ఘ‌ట్టాలు ఓ రేంజులో ఉంటాయి. ఇందులోనూ వైవిధ‌భ‌రిత‌మైన పోరాట స‌న్నివేశాలు డిజైన్ చేశారు. నీటిలో ఓ పోరాట దృశ్యం ఉంద‌ట‌. అందులో సూర్య డూప్ లేకుండా న‌టించాడ‌ట‌. అంజ‌లి ప్రత్యేక గీతం త‌ప్పకుండా మాస్‌ని అల‌రిస్తుంద‌ని చిత్రబృందం చెబుతోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ఇటీవ‌లే విడుద‌ల‌య్యాయి.