Site icon TeluguMirchi.com

‘సింగం’ సంద‌డి!

singam-సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం సింగం. తెలుగులో య‌ముడుగా వ‌చ్చింది. హ‌రి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధమైంది. అదే సింగం. తొలి భాగంలో ఉన్న న‌టీన‌టులంతా.. ఈ సినిమాలోనూ క‌నిపిస్తారు. హ‌న్సిక మాత్రం బోన‌స్ ఎంట్రీ. సినిమా పూర్తయింది. ఈనెల 14న పాట‌ల్ని, 28న సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సింగం టీజ‌ర్లు, ట్రైల‌ర్లు… బుధ‌వారం సాయింత్రం హైద‌రాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సూర్య మాట్లాడుతూ ”బాధ్యత‌తో తీసిన సినిమా ఇది. తొలి భాగం.. అన్ని భాష‌ల్లోనూ బాగా ఆడింది. అప్పుడు మాకు సీక్వెల్ తీయాల‌నే ఆలోచ‌న లేదు. వ‌చ్చిన త‌ర‌వాత మాత్రం భ‌య‌ప‌డ్డాం. అంచ‌నాల‌ను త‌ట్టుకొనేందుకు చాలా క‌ష్టప‌డ్డాం. య‌ముడు కంటే ఈ సినిమాలో ఎన‌ర్జీ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. త‌ప్పకుండా అంద‌రికీ న‌చ్చుతుంది. బాలీవుడ్ సినిమాలంటే నాకిష్టం. అయితే ఇప్పుడ‌ప్పుడే అటువైపుకు వెళ్లే ఆలోచ‌న‌ల్లేవు..” అన్నారు. ”సూర్యతో రెండోసారి న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది. హ‌రికి అన్ని విష‌యాల ప‌ట్ల మంచి ప‌ట్టు ఉంది. ఈసినిమాని చాలా బాగా తీశారు..” అని అనుష్క చెప్పింది.

Exit mobile version