శింబు మ‌ళ్లీ సింగేశాడు!

simbuత‌మిళ క‌థానాయ‌కుడు శింబు.. మ‌రోసారి గ‌ళం ఎత్తాడు. త‌న కోసం కాదు. త‌న స్నేహితుడి సినిమా కోసం. ఈమ‌ధ్య‌…. తోటి క‌థానాయ‌కుల సినిమాల్లో పాట‌లు పాడ‌డానికి శింబు ఉత్సాహం చూపిస్తున్నాడు. బాద్‌షా, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమాల్లో ఒక్కో పాట ఆల‌పించాడు. ఇప్పుడు మ‌నోజ్ సినిమా కోసం ఓ పాట పాడేశాడు. మనోజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం పోటుగాడు. ఈ సినిమాలో శింబు చేత ఓ హుషారైన పాట పాడించారు. శింబు- మ‌నోజ్ మంచి స్నేహితులు. ఇది వ‌ర‌కు నేను మీకు తెలుసా? సినిమాలోనూ శింబు ఓ పాట పాడాడు.