మన హీరోలు యాభై ఏళ్ల వయసొచ్చినా హీరోలే. చేతిలో పుస్తకాలు పట్టుకొని కాలేజీకి వెళ్లడానికి కూడా సిద్ధపడతారు. కథానాయికలు మాత్రం పెళ్లయితే అమ్మ, వదిన పాత్రలకు షిఫ్ట అయిపోవలసిందే. ప్రస్తుతం సిమ్రాన్ కూడా అలాంటి పాత్రల కోసమే ఎదురుచూస్తోంది. టాప్ స్టార్లతో కలిసి నటించింది. పెళ్లయ్యాక మాత్రం ఆమెను పరిశ్రమ దూరంగా ఉంచింది. ఆ తరవాత ఎన్ని ప్రయత్నాలు చేసినా వెండి తెరపై మెరిసే అవకాశం దక్కలేదు. ఇప్పుడు సూర్య సినిమా ద్రువ నక్షత్రంతో ఓ ఛాన్స్ అందుకొంది. ఈసారి సూర్యకి తల్లిగా నటిస్తోంది. తెలుగులో కొంతమంది దర్శక నిర్మాతలు కూడా తల్లి పాత్ర కోసం సిమ్రాన్‌ని సంప్రదిస్తున్నారట. ”తల్లి పాత్రలు చేస్తే తప్పేంటి? నా వయసు అదే కదా? చిత్రపరిశ్రమ ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకోవడమే సంతోషం..” అంటోంది సిమ్రాన్. అంటే సిమ్రాన్ కూడా తల్లి పాత్రలకు ఫిక్సియిపోయినట్టే కదా?