శంకరన్న సరెండర్

sankar raoతనను వేధిస్తున్నారంటూ మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు కోడలు వంశీప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లో ఆమె .. తన భర్త శశాంక్, మామ శంకర రావు, అత్త విశ్వశాంతి, ఆడపడుచు సుష్మితను అరెస్టు చేయాలని  కోరారు. వారు తమను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. వంశీప్రియ పిటిషన్ స్వీకరించిన కోర్టు శంకర్రావు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో శంకర రావు ఈ రోజు సిసిఎస్ మహిళా పోలీసుల ఎదుట లొంగిపోయారు. శంకర రావుతో పాటు ఆయన భార్య విశ్వశాంతి కూడా లొంగిపోయారు. ఇప్పటికే వారు ముందస్తు బెయిల్‌ను పొందారు.