దత్ కు సెక్యూరిటీ టైట్..!

sanjaydutthపుణెలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబై జైలులో మాఫియా లీడర్ అబూసలేంపై తోటి ఖైదీ కాల్పులు జరపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సంజయ్ దత్ భద్రతా సిబ్బందిని పెంచారు. గతంలో..  సంజయ్ దత్ పై దాడికి అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ నుంచి జైలు అధికారులకు హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే.