కెజిఎఫ్ 2 లో సంజయ్ మేకప్ కోసం ఎంత సమయం కేటాయించారో తెలుసా..?

కేజీఎఫ్‌..ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో డబ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేయగా ..యష్ హీరోగా నటించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్‌లో అధీరా అనే పాత్ర‌ని సస్పెన్స్‌లో పెట్టిన చిత్ర యూనిట్ సెకండ్ పార్ట్ మొత్తం ఆ పాత్ర చుట్టే తిరుగుతుంది. ఈ పాత్ర లో బాలీవూడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారు.

వి కింగ్స్ వారియర్ రోల్ నుంచి ప్రేరణగా డిజైన్ చేసిన ఈ రోల్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటున్ది. అయితే ఈ రోల్ చూడ్డానికి బాగానే ఉన్నా ఈ రోల్ కోసం సంజయ్ ఏకంగా గంటకు పైగానే మేకప్ వేసుకోవాల్సి వచ్చేది అంట.
ముఖంపై టాటూలు హెయిర్ స్టైల్ అలాగే డ్రెస్సింగ్ అంతటికీ కలిపి తనకి గంటకు పైగానే సమయం తీసుకోవాల్సి వచ్చేది అని తెలుస్తుంది.