Site icon TeluguMirchi.com

హాస్పటల్ లో చేరిన సంజయ్‌ దత్..

బాలీవుడ్ హీరో సంజయ్‌ దత్ హాస్పటల్ లో చేరాడు. గత కొద్దీ రోజులుగా శ్వాస సమస్యతో బాధపడుతున్న ఈయన ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో చేరినట్లు ఏఎన్ఐ ప్రకటించింది. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అయినా సరే కొన్ని రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. ఇక సంజయ్ సినిమాల విషయానికి వస్తే..ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కెజిఎఫ్ 2 చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గా ఈయన తాలూకా ఫస్ట్ లుక్ వచ్చి ఆకట్టుకుంది.

Exit mobile version