సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్..ఏ స్టేజ్ లో ఉందో తెలుసా ..?

బాలీవుడ్ హీరో సంజయ్‌ దత్ హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా శ్వాస సమస్యతో బాధపడుతున్న ఈయన ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో చేరారు. రెండు రోజులపాటు ఆయ‌నను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం జనరల్‌ వార్డుకు షిఫ్ట్‌ చేసి అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత.. పూర్తిగా కోలుకున్న సంజయ్‌ దత్‌ సంపూర్ణ ఆరోగ్యంతో సోమవారం ఇంటికి చేరుకున్నారు. తాము ఆరాధించే నటుడు కోలుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

కానీ వారికీ ఇప్పుడు ఓ షాకింగ్ వార్త ..సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని , అది కూడా 3 వ స్టేజ్ లో ఉందని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. ఎన్నో కష్టాలను అధిగమించి ప్రశాంతమైన జీవితం సాగిస్తున్న సంజయ్ దత్‌కు మళ్లీ లంగ్ క్యాన్సర్ సమస్య అంటే.. వినడానికే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రస్తుతం సంజయ్ దత్ యుఎస్‌లో ఈ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు వెళ్లబోతున్నట్లుగా ముంబై మీడియా ప్రకటించింది