మ‌హేష్ స‌ల‌హాల వ‌ల్లేన‌ట‌..!

maheshbabu samnanthaవ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది స‌మంత‌. తొలి సినిమా ఏం మాయ చేశావె ద‌గ్గర నుంచి ఇప్పటి వ‌ర‌కూ ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉంటోంది. మ‌ధ్యలో అనారోగ్య కార‌ణాల‌తో రెండు నెల‌లు విశ్రాంతి తీసుకొంది త‌ప్ప – ఎక్కువ‌గా షూటింగ్ సెట్లోనే గ‌డిపింది. మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోల‌తో రెండేసిసార్లు న‌టించే అవ‌కాశం ద‌క్కించుకొంది. కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌… క్రేజీ సినిమాల్నీ వ‌దులుకొంది. మీ విజ‌య‌సూత్రం ఏమిట‌ని అడిగితే మ‌హేష్‌బాబు ఇచ్చిన స‌ల‌హానే అంటోంది. ”దూకుడు స‌మ‌యంలో మ‌హేష్‌బాబుతో తొలిసారి ప‌నిచేశా. ప్రతి సినిమానీ నీ తొలి సినిమాగా భావించు.. అని చెప్పారాయ‌ట‌. ఆ మాట నాకెంతో స్ఫూర్తి ఇచ్చింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నా. ప్రతి సినిమానీ రాక రాక వ‌చ్చిన అవ‌కాశంగానే భావిస్తా…” అంటోంది స‌మంత‌.