‘ఏం నూనె రాశావే’ అంటున్న సమంత

ఇటు  సినిమాల్లోనూ అటు యాడ్స్ లోను దూకుడు చూపిస్తుంది సమంత. పవన్, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ చాన్సులే కాదు యాడ్స్ కూడా సమంతకు బాగానే వస్తున్నాయి. మొన్న  ఓ మొబైల్ కంపెనీ ,నిన్న ఓ షాపింగ్ మాల్ ఈ రోజు ఓ పేరున్న ఆయిల్ బ్రాండ్ ఇలా ఈ లక్కీగర్ల్ కు ఆఫర్ల పై  ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం   సమంత డాబర్ వాటిక ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయింది. ఈ విషయాన్ని సమంత  స్వయంగా తెలిపింది ‘ డాబర్ వాటిక వారితో ఒప్పందం కుదిరింది. డాబర్ టీంలో నేను ఒక భాగమవ్వడం ఆనందంగా వుందని , డాబర్ వాటిక  మంచి పేరున్న బ్రాండ్  అని సమంత ట్విట్టర్ లో తెలిపింది.