లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లన్ని బంద్ కావడం తో సినీ స్టార్స్ అంత ఇంటికే పరిమితమయ్యారు. అయితే సమంత ఇంట్లోనే యోగా, ధ్యానం చేస్తూ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టింది. అలాగే తన ఇంటిపై వ్యవసాయం కూడా మొదలుపెట్టింది. తనకు కావాల్సిన ఆహారాన్ని తనే స్వయంగా పండించుకుంటోంది. వాటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది.
తాజాగా సమంత తన ఇంటిపై క్యారెట్లను పండించింది. ఇక, ఈ వారమంతా క్యారెట్‌తోనే వంటలు చేయబోతున్నట్లు వెల్లడించింది. ‘ఈ వారం మెనూ.. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా’.. అంటూ ఈ వారమంతా క్యారెట్‌తో రకరకాల వంటకాలు చేయబోతున్నట్టు తెలిపింది.