రూపీ@58.35

rupee-falls-అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం ఆగడం లేదు. డాలర్ బలపడుతున్న కొద్దీ.. రూపాయి విలవిలలాడిపోతోంది. నిన్న (సోమవారం) జీవితకాల కనిష్టస్థాయిని తాకిన రూపాయి.. ఈరోజు మరో 20 పైసలు నష్టపోయి రూ. 58.35 వద్ద టేడయింది. దీంతో అందరి ఆశలు 18న జరగనున్న ఆర్ బీఐ సమావేశం చుట్టూనే
తిరుగుతున్నాయి. అయితే, రూపాయి ఇక ఇక్కడి నుంచి పెద్దగా పతనం అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. కాగ,  గత ఏడాది జూన్ లో రూపాయి 57 రూపాయల 32 పైసలను తాకి కనిష్ఠ స్థాయిని నమోదు చేసిన విషయం తెలిసిందే.