దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు కోలీవుడ్ నటుడు సముద్రఖని , హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సినిమా చిత్రీకరణ పూర్తిగా ఆగింది. అయితే దసరా తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకోని మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలి అని నిర్మాత దానయ్య తో రాజమౌళి చర్చ జరుపుతున్నాడట.
మొదటగా రాజమౌళి ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడే 2020 జూలై 30వ తారీఖున అని క్లారిటీ ఇచ్చారు. కానీ తర్వాత అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత 2021 సంక్రాంతి రేస్ లో నిలుపుతామని చెప్పారు కానీ కరోనా వచ్చి దెబ్బ తీసింది. ఇక దీనితో రాజమౌళి మొదట తాను అనుకున్న ముహుర్తానికే మళ్ళీ ఫిక్స్ అయ్యినట్టు ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 2020 జూలై 30 కి ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని అదే తేదీన 2021 జులై 30 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకుంటున్నారట. మరి ఆ డేట్ అయినా ఖరారు అవుతుందా మళ్లీ వాయిదా పడుతుందా అనేది చూడాలి.